ఏపీ రాజధానిపై మరో సరికొత్త వాదన తెరపైకి

ఏపీ రాజధానిపై మరో సరికొత్త వాదన తెరపైకి

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల చిచ్చు చల్లారక ముందే రాయలసీమకు చెందిన కొందరు నేతలు సరికొత్త ప్రతిపాధనలు తీసుకువచ్చారు… సీమలో హైకోర్టుతో పాటు రాజధానిని కూడా ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు…

ఇప్పటికే రాయలసీమ రాజధాని కోసం నేతలు సంఘాలతో కలిసి పనిచేస్తామని క్యాబినెట్ నిర్ణయం తర్వాత మా కార్యచరణ ప్రకటిస్తామని మైసూరా రెడ్డి స్పష్టం చేశారు… తమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వరు నిధులు కేటాయించరు ఇంకా ఎందుకు మీతో కలిసి ఉండాలని ఆయన మండిపడ్డారు…

ప్రభుత్వ భూములు ఉన్న రాయలసీమను వదిలేసి వేరే చోట రాజధాని ఎందుకు అని ఆయన ప్రశ్నించారు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానిని త్యాగం చేశామని ఇప్పుడు త్యాగం చేయమని అన్నారు…