ఏపీ తెలంగాణ‌లో హ‌ట్ స్పాట్ జిల్లాల లిస్ట్ ఇదే కేంద్రం ప్ర‌క‌ట‌న

ఏపీ తెలంగాణ‌లో హ‌ట్ స్పాట్ జిల్లాల లిస్ట్ ఇదే కేంద్రం ప్ర‌క‌ట‌న

0

దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ అమ‌లు అవుతోంది.. అయితే మే 3 వ‌ర‌కూ ఇక లాక్ డౌన్ అమ‌లు చేయ‌నున్నారు, ఈ స‌మ‌యంలో కొన్నింటికి కాస్త రిలీఫ్ ఇచ్చింది కేంద్రం …వ్య‌వ‌సాయ‌రంగంలో ఉండే వారికి ఆ ప‌రిశ్ర‌మ‌ల‌కు కాస్త రిలీఫ్ ఇచ్చారు, ఇక ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు రిలీజ్ చేశారు.

అయితే కొన్ని జోన్ల రూపంలో ఈ వైర‌స్ ప్రాంతాల‌ని గుర్తించారు.. గ్రీన్ రెడ్ ఆరెంజ్ జోన్ల‌గా విభ‌జించారు. ఇక ఆజాబితాల‌ని కూడా కేంద్రం రిలీజ్ చేసింది మ‌రి ఏపీ తెలంగాణ‌లో ఆ జోన్లు హ‌ట్ స్పాట్లు ప్రాంతాలు చూద్దాం.

170 జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలు హాట్‌స్పాట్‌ జాబితాలో ఉన్నాయి. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను.. తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్ఉన్నాయి, అలాగే ఏపీలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు జోన్లో ఉన్నాయి.