ఏపీ తెలంగాణ మధ్య బస్సులకు గ్రీన్ సిగ్నల్ ? రిజర్వేషన్లు ఎప్పుడంటే

ఏపీ తెలంగాణ మధ్య బస్సులకు గ్రీన్ సిగ్నల్ ? రిజర్వేషన్లు ఎప్పుడంటే

0

ఏపీ తెలంగాణ మధ్య బస్సులు ఎప్పుడు తిరుగుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఆర్టీసీ నుంచి ఎప్పుడు గుడ్ న్యూస్ వస్తుంది అని అందరూ చూస్తున్నారు, ఈ సమయంలో ఓ శుభవార్త వినిపిస్తోంది, నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయట. బస్సులను బయటకు తీసి, రాష్ట్రాల సరిహద్దులను దాటించేందుకు సిద్ధంగా ఉండాలని, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు రూట్లలో బస్సులను తిప్పాలని తెలంగాణ ఆర్టీసీకి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి.

ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే బస్సులను సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. ఇక నేడు సాయత్రం లోపు దీనిపై కీలక ప్రకటన రావచ్చు, ఇక వెంటనే ఆన్ లైన్ రిజర్వేషన్ కూడా స్టార్ట్ చేస్తారు.

చర్చల తర్వాత 1.61 లక్షల కిలోమీటర్లను తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధపడింది..ఇక ప్రజలకు బాధలు తీరినట్లే, దాదాపు వేలాది రూపాయలు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడికి కూడా అడ్డుకట్ట వేయాలి అంటున్నారు ప్రయాణికులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here