ఆపరేషన్ కమ్మ స్టార్ట్ చేసిన వైసీపీ

ఆపరేషన్ కమ్మ స్టార్ట్ చేసిన వైసీపీ

0

తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మంచి ప‌ట్టు ఉంది.. అయితే ఈ ఎన్నికల్లో ఆ పట్టు కోల్పోయింది..మెజార్టీ వైసీపీ స్ధానాలు గెలిచింది. అయితే చంద్రబాబు పై నమ్మకం సన్నగిల్లడం నేతలపై అవినీతి ఆరోపణలు ఇలా అనేక కారణాలు కనిపిస్తుంటాయి. అయితే జగన్ అధికారంలోకి రాకముందే కమ్మసామాజికవ వర్గం నుంచి నేతలను పార్టీలో చేర్చుకోవాలి అని చూశారు.

ఎన్నికలకు ముందు కొందరిని ఆకర్షించారు కాని వారు పార్టీలోకి రాలేదు.. అయితే బాబు ఓటమి ఎప్పుడు వచ్చిందో అప్పుడు పార్టీలో చేరిపోతున్నారు నేతలు.

ఇక గన్నవరం నుంచి ఫక్తు తెలుగుదేశం నేత అనుకున్న వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు, అలాగే ఆయన వైసీపీలో చేరుతున్నారు, ఇక దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. మరో కీలక నేత కూడా కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకుడు జిల్లా నుంచి పార్టీలోకి చేరనున్నారట. మొత్తానికి వరుస పెట్టి జిల్లాలో కమ్మ సామాజిక వర్గ నేతలనే చేర్చుకోవడంతో పార్టీ ఆపరేషన్ కమ్మ స్టార్ట్ చేసింది అని టీడీపీ భావిస్తోంది.