అరగంటలో మద్యం బాటిల్ లేపేస్తా అన్నాడు చివరకు దారుణం జరిగింది

అరగంటలో మద్యం బాటిల్ లేపేస్తా అన్నాడు చివరకు దారుణం జరిగింది

0

చాలా మంది ఏదో తాము చేసేస్తాం అని బిల్డప్ ఇస్తారు.. వారి వల్ల కాకపోయినా సాధిస్తాం అని కవర్ చేసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు ..ముఖ్యంగా మందు విషయంలో తాను ఫుల్ బాటిల్ దించకుండా తాగుతా అని పందెం కాసే వాళ్లు ఉన్నారు.. తాజాగా ఇలాంటి పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.
ఓ వ్యక్తి కాసిన పందెం చివరికి అతని ప్రాణాలు తీసింది. అర గంటలో ఫుల్ బాటిల్ లేపేస్తా అని స్నేహితులతో సరదాగా పందెం కాసి చివరికి చనిపోయాడు

నిజామాబాద్ లో ఈ దారుణమైన ఘటన జరిగింది. స్నేహితులు సరదాగా అన్న మాటల్ని సీరియస్గా తీసుకొని, అతను ఈ చర్యకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అరగంటలో ఫుల్ బాటిల్ మొత్తం తాగేస్తానంటూ సవాల్ చేశాడు. అతని వయసు 35 ఏళ్లు స్నేహితులు పందెం కాశారు చివరకు నోటిలో మద్యం బాటిల్ పెట్టుకుని గడగడ తాగాడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

అయితే ముందు కొద్దిపాటి మద్యానికే మత్తెక్కిందా అని స్నేహితులు హేళన చేశారట దీంతో అరగంటలో బాటిల్ లేపుతా అని పందెం కాసి తాగి మరి చినపోయాడు పాపం . సాధారణ మత్తు అనుకొని, స్నేహితులు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు, మందుబాబులు జాగ్రత్త పందెలా జోలిక వెళ్లకండి