అర్థిక మంత్రికి అదిరిపోయే సవాల్

అర్థిక మంత్రికి అదిరిపోయే సవాల్

0

టీడీపీ అధికారంలో చంద్రబాబు నాయుడు సన్నిహితులు బంధువులు పెద్దఎత్తును భూములను కొన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు… మొదట్లో నూజీవిడు ప్రాంతం అని ప్రకటించి వేళ ఎకరాలను తక్కువ ధరకు కొన్నారని అన్నారు…

బాలకృష్ణ వియ్యంకుడికి 499 ఎకరాలు ఇచ్చారని ఎకరం కేవలం లక్ష రూపాయలకే ఇచ్చారని బుగ్గన ఆరోపించారు… అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుకు కూడా రాజధానిలో భూములు ఉన్నాయని అన్నారు… మైత్రి ఇన్ ఫ్రాతో రావెలకు సంబంధాలు ఉన్నాయని బుగ్గన తెలిపాలిరు..

దీనిపై రావెల స్పందించారు… అమరావతిలో తనకు స్థలం ఉందనే దానిపై ఖండించారు…. తనకు మైత్రిలో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని నిరూపిస్తే తాను రాజీయాలనుంచి తప్పుకుంటానని అన్నారు… నిరూపించలేని పక్షంలో బుగ్గన రాజేంద్రనాథ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు… మైత్రితో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన బుగ్గన వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే న్యాయపోరాటం చేస్తానని అన్నారు…