అరుంధతి సినిమాలో ముందు ఆహీరోయిన్ని అనుకున్నారట – కాని రిజక్ట్ చేసింది ఆమె ఎవరంటే

అరుంధతి సినిమాలో ముందు ఆహీరోయిన్ని అనుకున్నారట - కాని రిజక్ట్ చేసింది ఆమె ఎవరంటే

0

టాలీవుడ్ లో అనుష్క ఎన్నో హిట్ సినిమాలు చేసింది, టాలీవుడ్ లో అందరూ హీరోల సరసన నటించింది, స్వీటి, ఇక లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అంటే స్వీటీ అనుష్క పేరు వినిపిస్తుంది, అంత అద్బుతంగా నటిస్తుంది అనుష్క.
సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అరుంధతి చిత్రంతో మంచి ఫేమ్ సంపాదించింది.

ఆమె కెరియర్లో టాలీవుడ్ టాప్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా, ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. అలాంటి రోల్ తో రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి-2, భాగమతి.. సినిమాలు ఆమెకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టాయి.
శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకి ముందు అసలు అనుష్కని అనుకోలేదట,

2009లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంలో ముందు ఎవరిని అనుకున్నారంటే…ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ ఫేం మమతా మోహన్దాస్. ముందు ఆమెని సంప్రదించారట, కాని ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నప్పటికీ అరుంధతి పాత్రను పోషించేందుకు సుముఖత వ్యక్తం చేసింది, కాని ఈ సినిమాకి చాలా నెలలు టైం కేటాయించాలని ఈ సమయంలో మరికొన్ని సినిమాలు చేయచ్చు అని ఆమె వదులుకున్నారు. చివరకు అనుష్కని టీమ్ సంప్రదించి ఆమెతో ఈ సినిమా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here