టీడీపీకి బిగ్ షాక్ అనారోగ్యంతో బాధపడుతున్న మరోనేత

టీడీపీకి బిగ్ షాక్ అనారోగ్యంతో బాధపడుతున్న మరోనేత

0

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏవైపు చూసినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి… ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న తర్వాత పార్టీని ఓ ట్రాక్ కు తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు పార్టీకి వెన్నెములా ఉన్న సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు.

ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు…

విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని అశోక్ గజపతి రాజు నివాసంలో ఆయన్ను పారామర్శించారు… ఆయన వెంటనే కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు… కాగా కొద్దికాలంగా గజపతి రాజు టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే…