ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘అశ్వద్ధామ’ ట్రైలర్

ఆసక్తిని రేకెత్తిస్తున్న 'అశ్వద్ధామ' ట్రైలర్

0

యాక్ష‌న్ సినిమాతో ఆక‌ట్టుకోవాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు యంగ్ హీరో నాగ‌శౌర్య‌. అందు కోసం ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల మ‌య్యారు కూడా. అయితే గ‌త అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని మాస్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసే క‌థ‌తో నాగశౌర్య చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `అశ్వ‌ద్ధామ‌`.

ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ – ఎమోషన్ .. ఛేజింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఒక మర్డర్ మిస్టరీని హీరో ఛేదించడమే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. “ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు .. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు .. వేట కుక్కల్లా వెంటపడే జాలరులు .. శకునిలాంటి ఒక ముసలోడు. వీళ్లందరినీ ఒకే స్టేజ్ పై ఆడిస్తున్న సూత్రధారి ఎవరు?” అనే నాగశౌర్య డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సినిమాపై ముందు నుంచీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్‌లో ఆశ‌లు పెరిగాయి. ఇప్పుడు ట్రైల‌ర్‌తోనూ ఆ ఆశ‌ల్ని, అంచ‌నాల్నీ స‌జీవంగా ఉంచాడు నాగ‌శౌర్య‌. నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది.