బాలీవుడ్ హీరో తో సౌత్ డైరెక్టర్ కొత్త సినిమా..!!

బాలీవుడ్ హీరో తో సౌత్ డైరెక్టర్ కొత్త సినిమా..!!

0

డైరెక్టర్స్ ఇతర బాషా హీరోలను డైరెక్ట్ చేయడం పెద్ద విషయమేం కాకపోయినా తీసిన రెండు మూడు సినిమాలకే బాలీవుడ్ లో హీరో ను డైరెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. తమిళంలో విజయ్ తో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.

‘తెరి'(పోలీస్‌), ‘మెర్సల్‌'(అదిరింది) బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన తాజాగా ‘బిగిల్‌'(విజిల్‌) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే అట్లీ బాలీవుడ్ స్టార్ హీరో షారూక్‌ఖాన్‌తో సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. డిసెంబర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ప్రారంభం అవుతుందని టాక్‌. షారూక్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించడానికి అట్లీ ప్లాన్ చేశాడని వార్తలు వినపడుతున్నాయి.