తెలంగాణాలో దారుణం.. మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

0

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా తెలంగాణాలో కూడా ఇలాంటి ఘటనే ఓ బాలిక జీవితాన్ని అందాకరమయం చేసింది.

వివరాల్లోకి వెళితే..నమ్డిమేట్కు చెందిన నవీన్ అనే యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నారాయణఖేడ్‌లో చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండల పరిధిలోని ఓ 14ఏళ్ళ మైనర్ బాలిక ఈ నెల 6న కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాంటాక్ట్ వివరాల ఆధారంగా విచారించగా..అసలు నిజం బయటపడింది.

అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆ యువకుడు నాలుగైదుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. ప్రస్తుతం పోలీసులు అతనిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here