దారుణం..కన్న తండ్రే కామాంధుడిలా మారి..

Atrocities in Telangana..Kanna's father turned into a lover ..

0

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే..కూతురు పాలిట కామాంధుడిలా మారాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని కూడా చేశాడు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేటలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మోమిన్‌పేటకు చెందిన ఓ వ్యక్తి బతుకు దేరువుకోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌ లో నివసిస్తున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురి కాగా..ఆమెను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భవతి అని వైద్యులు తెలిపారు.

దీంతో తల్లి బాలికను నిలదీసింది. తన గర్భానికి కారణం కన్నతండ్రి అని..ఇంట్లో ఎవరు లేని సమయంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రోదించింది. దీంతో తల్లి మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మోమిన్ పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here