జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు డేట్ ఫీక్స్ చేసుకున్న అయ్యన్న ఫ్యామిలీ

జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు డేట్ ఫీక్స్ చేసుకున్న అయ్యన్న ఫ్యామిలీ

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు ఫ్యామిలీ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సన్యాని పాత్రుడు ఈ నిర్ణయం తసుకున్నారని వార్తలు వస్తున్నాయి…

పార్టీ ఆవిర్భవం నాటి నుంచి చింతకాయల ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది. గతంలో మంత్రి హోదాలో అయ్యన్న పాత్రుడు బిజీగా ఉంటే సోదరుడు స్థానికంగా ఉండే కార్యకర్తలకు అండగా ఉంటూ వారి అవసరాలను చూసుకునేవారు… అంతేకాదు పార్టీని బలోపేతం చేసేవారు…

ఎన్నికల నాటి నుంచి కుటుంబంలో మొదలైన కలహాలవల్ల అన్నదమ్ముల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేంత వైర్యం నెలకొంది దీంతో సన్యాసి పాత్రుడు తన రాజకీయ దృష్ట్య వైసీపీలో చేరాలని చూస్తున్నారు. అనుచరులకోరిక మేరకు ఈనెల 6, లేక 7 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారు.