బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ

బాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ

0

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా తయారు అవుతోంది. 70 వయస్సులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు అని పిలుపునించి యువతతో పాదయాత్రకు దిగితే తమ్ముళ్లు మాత్రం గ్రూపు రాజకీయాలు చేసుకుంటున్నారు… ప్రస్తుతం విశాఖ జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి…

దీంతో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు…. సార్వత్రిక ఎన్నికల్లోలాగా స్థానిక ఎన్నికల్లో కూడా తమ పట్టు సాధించుకోవాలనేఉద్దేశంతో వైసీపీ టీడీపీలో ఉన్న బలమైన నాయకులను చేర్చుకుంటుంది… ఇప్పటికే విశాఖ డైరి చైర్మెన్ ఆడారి తులసీరావు ఫ్యామిలీ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మాజీ మంత్రి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడుని వైసీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేసుకుంది… ఆయనను పార్టీలో చేర్చుకుంటే టీడీపీ క్యాడర్ వైసీపీ వైపు తిరగడం ఖాయం. నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీకి మున్సిపాల్టీలో బలం… వైసీపీకి మండలాల్లో బలం ఉంది… అయితే మున్సిపాల్టీలో ఉన్న టీడీపీ బలాన్ని వైసీపీ వైపు తిప్పుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా సన్యాసి పాత్రుడుని వైసీపీలో చేర్చుకోవాలని చూస్తోంది.