బాస్టర్డ్ పై చంద్రబాబు క్లారిటీ

బాస్టర్డ్ పై చంద్రబాబు క్లారిటీ

0

ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమనే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అని మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు…. తిరిగి వాళ్ళే తాను అనని పదాన్ని అన్నట్టుగా సభలో సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు.

ఎంత కోపంలోనైనా వైసీపీ వాళ్ళలాగా తనకు సంస్కారహీనమైన భాష ఉపయోగించడం, అమర్యాదకరంగా ప్రవర్తించడం రాదని చంద్రబాబు నాయుడు అన్నారు.. అలాంటిది తన మీద ఇలాంటి కుట్రలు, ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చించారు..

సీఎంపై ప్రివిలీజ్ మోషన్ ఇస్తామని అన్నారు 6 నెలల పాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, తనను అసెంబ్లీలోకి రానివ్వకుండా చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. తన మీద, తెలుగుదేశంపై చేసే వైసీపీ కుట్రలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు…