జగన్ సర్కార్ పై చంద్రబాబు సెన్సెషనల్ కామెంట్స్

జగన్ సర్కార్ పై చంద్రబాబు సెన్సెషనల్ కామెంట్స్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెన్సెషనల్ కామెంట్స్ చేశారు….. ఇసుక అంశాన్ని ప్రస్తావిస్తూ కడప జిల్లాలో ఉండాల్సిన ఇసుక బెంగుళూరులో కనిపిస్తోందని ద్వజమెత్తారు…

తాజాగా కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అక్కడ కార్యకర్తలతో సమావేశం అయ్యారు… టీడీపీ హాయాంలో ఇసుక అక్రమ రావాణా జరుగుతోందని ఆనాడు ఇదే వైసీపీ నాయకులు ఆరోపించారని అయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు…

తమ హయాంలో ఇసుక ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు దానికంటే తక్కువ ధరకు ఎందుకు ఇవ్వడంలేదని అన్నారు… వైసీపీ నాయకులు ఏ భాషలో తిట్టాలో అర్థం కావడంలేదని అన్నారు చంద్రబాబు నాయుడు…