బాబు దీక్షపై టీడీపీ పత్రిక సంచలన కథనం

బాబు దీక్షపై టీడీపీ పత్రిక సంచలన కథనం

0

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు ఇసుకపై దీక్ష చేయనున్నారు.. 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన వెంటనే తెలుగుదేశం నేతలు దీనిని పెద్ద మహా దీక్షలా కవర్ చేశారు.. అయితే బాబు కార్యక్రమాలు ప్రతీది కవర్ చేసే టీడీపీ ఆస్ధాన పత్రిక కూడా రెండు రోజులు బాగానే కథనాలు వదిలింది.. కాని ఇఫ్పుడు పీఠముడి వేస్తోంది.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇసుక వారోత్సవాలు చేస్తాము అంటోంది. ఇసుక బాగానే అందుబాటులోకి వస్తోంది. అలాగే ఇసుక ఎగుమతి అక్రమంగా చేస్తే రెండు సంవత్సరాల జైలుశిక్ష అంటోంది. ఈ సమయంలో చంద్రబాబు చేసే దీక్ష వల్ల ఉపయోగం ఏమిటి అనేలా పెద్ద న్యూస్ కవర్ చేసింది.

దీంతో ఇది తెలుగుదేశం పత్రికేనా అనే అనుమానం అందరికి కలిగింది. జగన్ రీచ్ లు అందుబాటులోకి వచ్చాయి, ఇసుక దొరుకుతోంది అని చెబుతుంటే , మరి ఎందుకు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఈ దీక్షకు దిగడం, ఇది అనవసర దీక్ష అనేలా వార్త ఇచ్చింది. దీంతో ఆదిలోనే హంసపాదులా ఇది మారింది టీడీపీకి…మరి దీక్ష నేడు జరిగిన సమయంలో టీడీపీ వైసీపీ పై ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి, ఓపక్క పవన్ నారాలోకేష్ ఇసుకపై చేసిన ఫీట్లు ఫెయిల్ అయ్యాయి, కాబట్టి బాబు దీక్షని కూడా అబ్జర్వ్ చేయనుంది వైసీపీ.