మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..త్వరలో భారీగా పెరగనున్న బీర్ల ధరలు

0

ఈ మధ్యకాలంలో మద్యం సేవించే వారి సంఖ్య రోజురోజుకు అధికంగా పెరుగుతుంది. మద్యం సేవించడం ప్రాణానికి ప్రమాదమని చెప్పిన వినకుండా తాగడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు కొందరు యువకులు. అయితే ప్రస్తుతం అలా తాగేవారికి త్వరలో ఎక్సైజ్ శాఖ బీర్ ధరలు పెంచబోతున్నట్టు నిర్ణయం తీసుకొని చేదువార్త చెబుతుంది.

ఒక్క బీరు ధర రూ.10 నుంచి 20 రూపాయల వరకు పెరగనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక లైట్ బీర్ విషయానికి వస్తే  ధర.140 రూపాయలు ఉండగా అది 150కి పెరగనుంది. స్ట్రాంగ్ బీరు ధర 150 ఉండగా.. 160 కి పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ధరలు మార్కెట్లో అమల్లోకి వస్తే మందుబాబులు తీవ్ర నిరాశకు లోనవ్వక తప్పదు.

ప్రస్తుతం వేసవికాలం కావడంతో మందుబాబులు మద్యం సేవించడానికి అధికంగా మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్‌ల అమ్మకాలు జోరుగా జరగనున్న క్రమంలో ఈ పెరిగిన ధరలతో  త్వరలో బీర్ కొనాలంటేనే జంకావలసిన పరిస్థితి ఏర్పడింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here