బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఆ అందాల తారకు ఛాన్స్ ?

బాలకృష్ణ, బోయపాటి సినిమాలో ఆ అందాల తారకు ఛాన్స్ ?

0

బాలకృష్ణ, బోయపాటి చిత్రం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ లో కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది, ఈ సినిమా పై అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, మరీ ముఖ్యంగా ఇందులో హీరోయిన్స్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది, లీకులు వస్తున్నాయి కాని అఫీషియల్ ప్రకటన అయితే చిత్ర యూనిట్ నుంచి రావడం లేదు.

ఈ సమయంలో చాలా మంది పేర్లు వినిపించాయి…ఏడు నెలల లాక్ డౌన్ గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. హీరో బాలకృష్ణ కూడా షూటింగులో పాల్గొంటున్నారు..అయితే చిత్ర కథ ప్రకారం ఇందులో బాలయ్య డ్యూయర్ రోల్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారట, అయితే ఇప్పటికే మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ పాత్రకు పూర్ణను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా టైటిల్ కూడా మోనార్క్ అనేపేరు వినిపిస్తోంది, ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here