గ్రేటర్ లో బాలయ్య బాబు ప్రచారం టీడీపీ రెడీ ?

గ్రేటర్ లో బాలయ్య బాబు ప్రచారం టీడీపీ రెడీ ?

0

జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇక కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంది, ఇక ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ పార్టీలు బిజీగా మారిపోయాయి, ఇప్పటికే పలు జాబితాల్లో తమ పార్టీ తరపున అభ్యర్దులని ప్రకటించాయి పార్టీలు.

డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ పోటీ అయితే కనిపిస్తోంది, ఇక ఈసారి అభ్యర్దుల ప్రకటన కూడా చాలా వేగంగా ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీ గ్రేటర్ పరిధిలో ఏకంగా సగానికి సగం ఎమ్మెల్యేసీట్లను గెలిపించుకునేది కాని ఇప్పుడు దారుణమైన పరిస్దితిలో ఉంది.

అయితే గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటికి దిగింది.టీడీపీకి పుర్వవైభవం తీసుకురావాలని నారా లోకేష్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వినిపించాయి, అయితే తాజాగా బాలయ్య పేరు వినిపిస్తోంది, ఆయన గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగా బాలయ్య ప్రచారం చేస్తే ఆ ప్రభావం ఏమేర ఉంటుంది. ఓట్లు ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here