బాలకృష్ణ సినిమా నుంచి ఆమెని తప్పించారా ? టాలీవుడ్ టాక్

బాలకృష్ణ సినిమా నుంచి ఆమెని తప్పించారా ? టాలీవుడ్ టాక్

0

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజాగా ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో, ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు, గతంలో వచ్చిన లెజెండ్ సింహ తర్వాత ఈ కాంబో రాబోతోంది, మరోసారి సూపర్ హిట్ సినిమా అవుతుంది అని భావిస్తున్నారు నందమూరి అభిమానులు.

ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట.
అయితే ఈ సినిమాలో ఎన్నడూ లేనంత సస్పెన్స్ హీరోయిన్ విషయంలో కనిపిస్తోంది, బాలయ్య పక్కన ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు.

చాలా మంది పేర్లు వినిపించాయి, ఇంకా ఎవరిని ఫైనల్ చేశారో తెలియదు..ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్ను హీరోయిన్గా తీసుకున్నారు. తాజాగా ఆమెను తప్పించినట్టు వార్తలు వస్తున్నాయి బాలయ్య, ప్రయాగ జోడీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు టెస్ట్ షూట్ ఇటీవల చేశారట. ఆమె మరీ చిన్నపిల్లలా ఉండటంతో ఆమెని తప్పించారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది, మరి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేశారు అనేది మాత్రం ఇంకా అభిమానులకి సస్పెన్స్ అనే చెప్పాలి.. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్రకు పూర్ణను సెలెక్ట్ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here