బోయపాటికి ఆర్డర్ వేసిన బాలకృష్ణ.. షాక్ లో బృందం..!!

బోయపాటికి ఆర్డర్ వేసిన బాలకృష్ణ.. షాక్ లో బృందం..!!

0

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో బాలయ్య ఫ్రెంచ్ గడ్డం తో కనిపించనున్నాడు.. ఆ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఇక పోతే ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో ఆ సినిమా బడ్జెట్ గురించి బోయపాటి భారీ నంబర్ ను చెప్పారట. కనీసం యాభై నుంచి అరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆ సినిమాను రూపొందించాలని బోయపాటి అనుకుంటున్నాడట.

ఇదే ఆలోచనను అతడు బాలకృష్ణకు వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం అందుకు సమ్మతించలేదని సమాచారం. ఎటు తిరిగీ సినిమాను ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ తో పూర్తి చేయాలని బాలకృష్ణ ఆర్డర్స్ ఇచ్చేశాడట. అంతకు మించి బడ్జెట్ వద్దని.. ఖరాకండిగా చెప్పేశాడట.. మరి బోయపాటి ఈనిర్ణయం తీసుకుంటాడో చూడాలి..