కేఎస్ రవికుమార్ సినిమా కోసం రిస్క్ చేస్తున్న బాలకృష్ణ..!!

కేఎస్ రవికుమార్ సినిమా కోసం రిస్క్ చేస్తున్న బాలకృష్ణ..!!

0

బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఫ్రెంచ్ గడ్డం తో సరికొత్తగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.. సోనాల్ చౌహాన్ – వేదిక హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఈ సినిమాలో పాత్ర కోసం బాలకృష్ణ కొంతవరకు బరువు తగ్గారు. ఆ తరువాత సినిమా కోసం మరింత బరువు తగ్గనున్నారనేది తాజా సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో నటిస్తుండగా ఈ సినిమాలో పాత్ర కోసం పాతిక కిలోల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని బోయపాటి చెప్పినట్టుగా సమాచారం. దాంతో ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తి కాగానే, కొన్ని రోజుల పాటు ప్రత్యేకమైన కసరత్తులు చేస్తూ .. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గాలనే ఆలోచనలో బాలకృష్ణ వున్నారని చెప్పుకుంటున్నారు.