బాలకృష్ణ అఖండ చిత్రం రిలీజ్ డేట్ అదేనా ?

Balakrishnan New Movie Release Updates

0

 

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండ చిత్రం తెరకెక్కుతోంది. అఖండ నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన బోయపాటికి, ఈ కరోనా బ్రేకులు వేసిందనే చెప్పాలి. షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి .అయితే ఈనెలాఖరు వరకూ పరిస్దితి ఇలాగే ఉంటుంది అని భావిస్తున్నారు మేకర్స్.

కేసులు తగ్గితే వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తోపాటు, ట్రైలర్ కూడా బాలయ్య పుట్టిన రోజున విడుదల కానున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది ఫిలిమ్ నగర్ లో.

బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమాను, దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట మేకర్స్. దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చూస్తున్నారు. అయితే మరో రెండు షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వనుంది. చూడాలి మరి దీనిపై ఎలాంటి అప్ డేట్ వస్తుందా అనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here