బాలయ్య బాబు కు బాలీవుడ్ హీరోయిన్

బాలయ్య బాబు కు బాలీవుడ్ హీరోయిన్

0

బాలయ్య బాబు సినిమా అంటే మనకు వెంటనే ఆ ఫైట్లు డైలాగ్స్ గుర్తు వస్తాయి, అయితే బాలయ్య తాజాగా బోయపాటితో సినిమా చేస్తున్నారు, ఈ సినిమా దాదాపు 70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు, అయితే ఇందులో పారితోషికం కూడా బోయపాటి బాలయ్య అదిరిపోయే రేంజ్ లో తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.. అయితే బాలయ్య సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

ముఖ్యంగా శ్రియ పేరు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు మరో పేరు బాలయ్య సినిమాలో హీరోయిన్ గా వినిపిస్తోంది. అయితే ఆమె ఇక్కడ భామ కాదు బాలీవుడ్ భామ. ఇక బాలయ్య గత సినిమాలు చూస్తే బాలీవుడ్ భామలు చాలా మంది మెరిశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితం కానున్న ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నారట.

అయితే ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు ఎస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.. ఈ సినిమా పై బోయపాటి ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.. అందుకే ఈ సినిమా విషయంలో కీలకమైన నటులని తీసుకుంటున్నారట.. ఇక ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్ ను అనుకున్నారు.. ఆయన కూడా ఒకే చెప్పారు అని తెలుస్తోంది.. వచ్చే నెల నుంచి అవుట్ డోర్ షూట్ జరుగుతుంది అని తెలుస్తోంది.