బాలయ్య బోయపాటి సినిమా కథ ఏమిటో తెలుసా

బాలయ్య బోయపాటి సినిమా కథ ఏమిటో తెలుసా

0

బాలయ్య బోయపాటి సినిమాపై ఇప్పటికే చాలా వార్తలు వినిపిస్తున్నాయి, తాజాగా బోయపాటి హీరోయిన్ విషయంలో చర్చలు జరుపుతున్నారు.. ఇక జనవరి నుంచి బాలయ్య బాబుతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సీనియర్ నటులు ఇందులో నటించబోతున్నారు.. ఇప్పటికే టీమ్ ను సిద్దం చేస్తున్నారు బోయపాటి.. తాజాగా వీరి కాంబినేషన్ చెప్పుకుంటే సింహ లెజెండ్ హిట్ అయిన విషయం తెలిసిందే, టాలీవుడ్ లో చరిత్ర తిరగరాసిన సినిమాలుగా ఈ రెండు రికార్డు నమోదు చేశాయి.

మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు మళ్లీ మరో సినిమా చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సారి బాలకృష్ణ కోసం బోయపాటి ఎలాంటి కథను సిద్ధం చేసి ఉంటాడు? కథలో కొత్తదనం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బోయపాటి మళ్లీ అదే మేనరిజం బాలయ్యలో చూపిస్తారా, అలాంటి పవర్ ఫుల్ డైలాగులు ఇందులో ఉంటాయా అనేది కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బోయపాటి డివోషనల్ టచ్ కూడా ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం. అయితే బాలయ్య బాబుకి డివోషనల్ టచ్ అంటే ఆయన ఏ పాత్ర అయినా ఏ కథ అయినా న్యాయం చేస్తారు.. మరి ఇందులో ఎలాంటి టచ్ ఉంటుంది అనేది మాత్రం సీన్ రివిల్ అయ్యే అవకాశం లేదు.. కాని ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది అని తెలుస్తోంది. అందులో కాస్త డివోషనల్ టచ్ ఉంటుందట, అయితే 70 కోట్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.. ఈ చిత్రం ప్రీ బిజినెస్ కచ్చితంగా వంద కోట్లు అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తోందట.