బాలయ్యకు బాసటగా లోకేష్ దేనికంటే

బాలయ్యకు బాసటగా లోకేష్ దేనికంటే

0

రూలర్ చిత్రంపై బాలయ్య బాబు అభిమానుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది.. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ ఎదురుచూస్తున్నారు. అంతే కాదు సినిమా స్టిల్స్ చూస్తే బాలయ్య బాబు గత సినిమాల్లో కంటే లుక్స్ అదిరిపోయాయి. స్టిల్స్ కిరాక్ ఉన్నాయి అంటున్నారు అభిమానులు.

రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్గా నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని హ్యాపీ మూవీస్ బ్యానర్పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి వన్నీ ట్రైలర్లో చూపించి సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది చిత్రయూనిట్. అయితే టాలీవుడ్ లో బాలయ్య బాబు సినిమా ట్రైలర్ ట్రెండ్ నమోదు చేసింది.

తాజాగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?’బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా రూలర్ ట్రైలర్ అదుర్స్. దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా అని నారా లోకేష్ ట్వీట్ చేశారు…దీనిని టీడీపీ అభిమానులు నందమూరి ఫ్యాన్స్ షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.