ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య..బోయపాటి సరికొత్త క్యారెక్టర్..!!

ఆధ్యాత్మిక వేత్తగా బాలయ్య..బోయపాటి సరికొత్త క్యారెక్టర్..!!

0

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.డిజాస్టర్‌ మూవీ రూలర్‌ తరువాత బాలయ్య ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అటు బోయపాటి కూడా వినయ విధేయ రామ తరువాత ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో బాలయ్యతో కలిసి మూడోసారి జతకట్టిన ఈ దర్శకుడు అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో బాలకృష్ణ ఆధ్యాత్మిక వేత్తగా కనిపించనున్నాడట. బాలకృష్ణ అలా మారడానికి కారణం ఏమిటి అంతకుముందు ఆయన పాత్ర తీరు తెన్నులేమిటి అనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వాళ్ల ఎంపిక విషయంలో స్పష్టత రావలసి వుంది. ఈ సినిమాలో బాలకృష్ణను ఎదుర్కునే విలన్ గా హీరో శ్రీకాంత్ కనిపించనున్నాడట.

రూలర్ ద్వారా వచ్చిన చెడ్డ పేరును ఈ సినిమా పూర్తిగా చెరిపేస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. అందువల్ల హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.