బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అంటారు? అసలు బలుసాకు అంటే ఏమిటి తెలుసా

బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అంటారు? అసలు బలుసాకు అంటే ఏమిటి తెలుసా

0

నిజమే సూక్తులు మంచి మాటలు, నాలుగు మంచి వాఖ్యాలు చెప్పేవారు ఎక్కువగా చెప్పే మాట ఒకటి ఉంది, మంచిగా బతకాలి అని అనుకునేవారు బతికుంటే బలుసాకు అయినా తిని బతకచ్చు అంటారు.. అయితే ఈ సామెత చెబుతారు కాని, అసలు చాలా మందికి బలుసాకు అంటే తెలియదు, పల్లె గ్రామాలు వదిలి పట్టణాలకు వచ్చిన పిల్లలకు అయితే అసలు ఇది అంటే ఏమిటో కూడా తెలియదు.

బలుసాకు అంటే రెండు ముళ్లు ఉండి చిన్న ఆకులు ఉన్న ఒక కంప చెట్టు. పల్లెటూరు లలో ఇది పెరుగుతుంది. దీనిని బారదాజి, బలాక అని సంసృతoలో అంటారు. ఇది వైద్యానికి బాగా ఉపయోగపడుతుంది, దీనిని గతంలో పెద్దలు బాగా వాడేవారు, ముఖ్యంగా రాచపుండుకు మందుగా వాడేవారు, అలాగే పశువులు ఎక్కువగా రోగాల పాలు అయితే ఆ వైద్యంలో దీనిని వాడేవారు.

అంతేకాదు ఇన్ని మెడిసన్స్ వచ్చినా ఇప్పటికీ కొందరు ప్రకృతి వైద్యం లో వాడుతారు. ఇది తినే వైద్యoలో పత్యం( ఏమీ తిననివ్వరు) ఉంటుంది. వైద్యం పూర్తి అయ్యేదాకా వేరే ఆహార పదార్థాలు తిననివ్వరు కాబట్టి చాలా చేదుగా ఉండే ఈ ఆకు తిని అయినా సరే బ్రతకడo మాత్రమే ముఖ్యం అనే అర్థములో వాడే వారు,ఇక చాలా కష్టకాలంలో దీనిని సామెతగా వాడతారు.