బావ‌ని ప్రేమించింది అని 30 ఏళ్లుగా భార్య‌ని భ‌ర్త ఏం చేస్తున్నాడంటే

బావ‌ని ప్రేమించింది అని 30 ఏళ్లుగా భార్య‌ని భ‌ర్త ఏం చేస్తున్నాడంటే

0

సుజాత పేరు మార్చాం, ఆమెకి 30 ఏళ్ల క్రితం ఓ డాక్ట‌ర్ ని ఇచ్చి వివాహం చేశారు, అయితే తొలిరాత్రి ఏ దాప‌రికాలు లేకుండా మాట్లాడుకున్నారు, ఈ స‌మ‌యంలో ఆమె బావ‌ని ప్రేమించింది అని నిజం చెప్పింది, ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు, సినిమాలు షికార్లు తిరిగారు, కాని ఆమె తండ్రి బావ‌తో పెళ్లి చేయ‌లేదు, త‌ర్వాత ఈ డాక్టర్ కు ఇచ్చి వివాహం చేశారు అని ఓ నిజం చెప్పింది.

దీంతో మ‌న‌సులో వేరే వాడిని పెట్టుకుని న‌న్ను వివాహం చేసుకున్నావు అని ఆ రోజు నుంచి ఆమెతో కాపురం చేయ‌లేదు భ‌ర్త‌, పిల్ల‌లు లేరు , అస‌లు మొద‌టి రాత్రి కూడా జ‌ర‌గ‌లేదు, ఇప్ప‌టి వ‌ర‌కూ వారు అలాగే ఉంటున్నారు, కానిఇంటికి కావ‌ల‌సిన స‌రుకులు బ‌ట్ట‌లు అన్నీ ఆమెకి తెచ్చి ఇస్తాడ‌ట, స‌మాజంలో మ‌ళ్లీ విమ‌ర్శ‌లు అని ఇలా కొన‌సాగుతున్నాడు.

అత‌ను ఆమెతో కాపురం చేయ‌డం లేదు, చివ‌ర‌కు ఆమె కుటుంబ స‌భ్యుల‌కి చెప్ప‌లేదు, ఆమె త‌ల్లిదండ్రి సోద‌రుడు కూడా క‌న్నుమూశారు, చివ‌ర‌కు త‌న జీవితం ఇలాగే ముగుస్తుంది అని ఆమె బాధ‌ప‌డుతోంది, ఓ జ‌ర్న‌ల్ కు ఆమె త‌న బాధ‌గా రాసుకుంది, అన్నీ నిజాలు పంచుకున్నాను, కాని అర్ధం చేసుకోలేని భ‌ర్త వ‌చ్చాడు అని చివ‌రగా ఆమె తెలిపింది.

నిజంగా స‌మాజంలో ఇలాంటి వారు ఉంటారా అని ఆశ్చ‌ర్యం వేస్తోంది.