ఆనాడు క‌ర్ణుడు – నేడు ఓ ప‌సిపాప – న‌దిలో చెక్క‌పెట్టెలో వ‌దిలేసిన త‌ల్లిదండ్రులు

Became Karnudu - Today Baby Girl - Parents dumped in a wooden box in the river

0

పురాణాల్లో చూసుకుంటే కుంతిదేవి కర్ణుడిని పెట్టెలో ఉంచి నదిలో వదిలిపెడుతుంది. త‌ర్వాత క‌ర్ణుడు రాజ్యంలోకి రావ‌డం ఇవ‌న్నీ మ‌నం పురాణాల్లో చ‌దువుకున్న‌వే. అయితే ఇది నిజ జీవితంలో జ‌రుగుతుందా అంటే ఎవ‌రూ త‌మ బిడ్డ‌ని ఇలా వ‌దులుకోరు అనే చెబుతాం. కాని యూపీలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ దగ్గర సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన దాద్రి ఘాట్ ద‌గ్గ‌ర గుల్లు చౌదరి
గంగానదిలో చేపలు పట్టుకుని జీవిస్తాడు, ఇక సాయంత్రం న‌ది ఒడ్డున ఉన్న స‌మ‌యంలో ఓ చెక్క పెట్టె న‌దిలో క‌నిపించింది. వెంట‌నే ఏమిటా అని చూస్తే అందులో ఆడ‌బిడ్డ ఉంది.

ఆ పసిబిడ్డతో పాటు ఆ పెట్టెలో దేవతల ఫోటోలు పెట్టి ఉన్నాయి.ఆ పాప పుట్టినప్పటి తేదీ, సమయం,జాతకం వివరాలతో చార్ట్ కూడా ఉంది. ఆమె పేరు గంగ అని కూడా ఉంది. మే 25న జ‌న్మించింది అని రాశారు. ఆదేవుడు త‌న‌కు ఈ పాప‌ని ఇచ్చాడు అని ఆ జాల‌రి కుటుంబం ఆ పాప‌ని పెంచుకుంటోంది. అయితే దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here