తెరపైకి మరో సినీ వారసుడు.. అన్నకి తగ్గ తమ్ముడు అయ్యేనా..!!

తెరపైకి మరో సినీ వారసుడు.. అన్నకి తగ్గ తమ్ముడు అయ్యేనా..!!

0

ఇండస్ట్రీ లో వారసులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. తాజాగా మరో సినీ వారసుడు టాలీవుడ్ లోకి రాబోతున్నాడు.. ‘అల్లుడు శీను’ సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ .. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ నెల 5వ తేదీన ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పవన్ సాధినేని దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 1980 – 90 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.