బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ఇదే

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ఇదే

0

రాక్షసుడు సక్సస్ తో మంచి సక్సస్ లో ఉన్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ … ఇప్పటికే యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తన నెక్ట్స్ సినిమా కూడా స్టార్ట్ చేయనున్నాడు శ్రీనివాస్, దానికి సంబంధించి అప్ డేట్ కూడా వచ్చేసింది ప్రకటన రూపంలో… కందిరీగ, రభస, హైపర్ వంటి చిత్రాలు తీసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

దీంతో ఇది మరో పక్కా సూపర్ హిట్ మూవీ అవుతుంది అనే టాక్ టాలీవుడ్ లో మొదలైంది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 29 న రామానాయుడు స్టూడియోలో ఈచిత్ర ఓపెనింగ్ గ్రాండ్ గా చేయనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న

ఈ చిత్రం కోసం శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ బాడీ తో సిద్ధమయ్యారు. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాతగా ఉండనున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ బాణీలు అందిస్తున్నారు. హీరోయిన్ మిగిలిన నటీనటులు ఇతర క్రూ అందరి గురించి తర్వాత తెలియచేయనుంది చిత్ర యూనిట్.