బెల్లంకొండ ఆరోజున అదుర్స్ అనిపిస్తాడట..!!

బెల్లంకొండ ఆరోజున అదుర్స్ అనిపిస్తాడట..!!

0

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇటీవల సినిమాలేవీ కలిసి రాలేదు. కొత్తదనం పేరుతో ఆయన చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. దాంతో ఆయన కథ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని, ‘రాక్షసుడు’ సినిమా చేశాడు. తమిళంలో హిట్ కొట్టిన ‘రాచ్చసన్’ సినిమాకి ఇది రీమేక్.

రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ తోనే అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో వున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, నాయికగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ఈ తమిళ రీమేక్ తెలుగులోను హిట్ కొడుతుందేమో చూడాలి మరి.