పంజాబ్ ఆప్ ‘సీఎం’ అభ్యర్థిగా భగవంత్ మాన్

0

పంజాబ్​లో ఫిబ్రవరి 20న 117 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఇక పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ పేరు ఖరారు చేసింది ఆ పార్టీ. ఈ విషయాన్ని ఆమ్​ ఆద్మీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ మంగళవారం ప్రకటించారు. పంజాబ్‌లోని 3 కోట్లకు పైగా జనాభాలో 21,59,437 మంది తమ సర్వేలో స్పందించారని కేజ్రీవాల్​ వెల్లడించారు. వీరిలో 93.3 శాతం మంది సర్దార్ భగవంత్ మాన్ పేరు సూచించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here