అసలు భోగి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా…

అసలు భోగి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా...

0

పెద్దపండుగ సంక్రాంతి పండుగ రోజు మందు భోగి లేదా భోగిపండుగ ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా… దక్షిణాదిలో సూర్యుడు దూరమవుతుండటంతో భూమిపై బాగా చలి పెరుగుతుంది.. ఈ చలి వాతారణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే మంటలు వేయడం వలన సంక్రాంతి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి అని పేరు వచ్చింది.

ఒక నెల క్రితంమే తాటాకును మోపులను ఇళ్ల వద్దకే తెచ్చుని పెట్టుకుని బోగి మంటల్లో వేస్తారు… అలాగే ఇంట్లో ఉన్న పనికిరాని అట్టముక్కలను చెక్కలను తీసుకువచ్చి భోగి మంటల్లో వేస్తారు. ఈ పండుగ నాడు కొత్త బట్టలు ధరించి ఇక సంప్రదాయంగా ఉంది భోగి మంటల్లో వేడి చేసుకున్న నీరు లేదా ఇంట్లో ఉన్న నీరుతో స్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు… ఇకమహిళలు తెల్లవారు జామున లేని తమ తమ ఇంటిముందు పేడతెచ్చుకుని ఇంటి ముందు అలికి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గులలో కలర్స్ వేస్తారు…

భోగి సాధారణంగా జనవరి 13 లేదా 14 తేదీలల్లో వస్తుంది… భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసీ ఆశీర్వ దిస్తారు.. అందుచేత ఆ పళ్లను భోగి పళ్లు అంటారు.. భోగి పళ్ల ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయుణుడి ఆశీస్సులగా భావిస్తుంటారు… అంతేకాదు గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి…

ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. ఇక భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.