బిగ్ బాస్ షో నిర్వాహకులకు షాకిచ్చిన నెటిజన్లు

0

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పోటీ పడి చివరగా టైటిల్ సాధించడం అంటే మాములు విషయం కాదు. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు మంచి పేరు ఫేమ్ అవకాశాలు అన్నీ వస్తాయి, అయితే బాలీవుడ్ లో బిగ్ బాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది, ఇక తెలుగులో తాజాగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సీజన్నో బాబా భాస్కర్, శ్రీముఖీ వరుణ్, అలీ, రాహుల్ ఫైనల్ వీక్ కు వచ్చారు, చివరగా శ్రీముఖి, రాహుల్ మధ్య ఫైనల్ పోరు జరిగింది.

టైటిల్ విన్నర్ రాహుల్ అయ్యాడు, అయితే ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. బిగ్బాస్ 1 విజేతగా నిలిచిన శివబాలాజీ రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. ఇక సీజన్ 2లో బిగ్బాస్ విన్నర్ గా కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు. కాని షో తర్వాత కౌశల్ సినిమాల్లోకి రానున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. అవన్నీ కేవలం మాటలు అయ్యాయి, అలాగే శివబాలాజీ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పెద్ద సినిమాల్లో కూడా కనిపించలేదు

మరి ఇప్పుడు రాహుల్ పరిస్దితి ఏమిటి అనే చర్చ నడుస్తోంది. సీజన్లలో విజేతలకు ప్రైజ్మనీ తప్పితే అంతకుమించి వచ్చింది ఏమీ లేదు అంటున్నారు. అయితే రాహుల్ మాత్రం చివరి వరకూ పోరాడి గెలిచాడు, అందరు వేరు రాహుల్ వేరు అంటున్నారు, రాహుల్ మంచి సింగర్ కావడంతో తనకు పెద్ద పెద్ద సినిమాల్లో పాటలు పాడే అవకాశం వస్తుంది అంటున్నారు. మరో చరిత్ర స్రుష్టిస్తాడు అంటున్నారు అభిమానులు.