ICICI బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ షాక్..!

0

ICICI బ్యాంక్ తన ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు కూడా ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది.

క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపింది. ఇక నుంచి క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది.  కనీసం రూ.500 చొప్పున వసూలు చేస్తామని ఐసీఐసీఐ పేర్కొంది. అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు.

కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here