ముస్లింలకు బిగ్ షాక్..దుల్హన్ పథకం నిలిపివేసిన సర్కార్

0

ఏపీ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతోంది. దీనికి నిదర్శనమే దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని వెల్లడించింది. అందుకే ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ నిర్ణయంతో ముస్లింలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చినట్లయింది.

టిడిపి ప్రభుత్వం హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి 50 వేల రూపాయలు అందజేసింది. అయితే ఏపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్యా ఈ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. దుల్హన్ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ పథకం అమలుపై హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here