బాబుకు బిగ్ షాక్ జనసేనలోకి వంగవీటి రాధా

బాబుకు బిగ్ షాక్ జనసేనలోకి వంగవీటి రాధా

0

2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన చంద్రబాబు నాయుడుకు ఆపార్టీ నాయకులు షాక్ లమీద షాక్ లు ఇస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కష్టతరంతో కూడుకున్న పని అని భావించి కొంతమంది తమ రాజకీయ భవిష్యత్ రిత్య ఇతర పార్టీల్లో చేరుతున్నారు..

ఈ క్రమంలో కొంతమంది వైసీపీలోకి మరికొంతమంది బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటిరాధా కూడా టీడీపీకి గుడ్ భై చెప్పేపనిలో పడ్డారని రాజకీయ వార్గాలనుంచి అందుతున్న సమాచారం…

తాజాగా తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్ కు ఆయన వెళ్లారు అక్కడ జరుగుతున్న సమావేశాల్లో రాధా పాల్గోని జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ ఛైర్మన్ మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు.. ఆతర్వాత పార్టీ అధినేతతో వంగ వీటి భేటీ కానున్నారని సమాచారం…