గంటాకు బిగ్ షాక్

గంటాకు బిగ్ షాక్

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కు బిగ్ షాక్ తగిలింది… గతంలో ఆయన అధికార బలంతో అక్రమంగా భీమిలీలో నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ను అధికారులు కూల్చేందుకు రంగం సిద్దం చేసుకున్నారు…

అంతేకాదు గెస్ట్ హౌస్ కూల్చేస్తామని అధికారులు కొద్దిసేపటి క్రితం నోటీసులు కూడా ఇచ్చారు… దీంతో గంటా గెస్ట్ హౌస్ వద్దకు జీవీఎంసీ అధికారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు..

వారితోపాటు పోలీసులుకుడా వచ్చారు… విషయం తెలుసుకున్న గంటా అనుచరులు మండిపడుతున్నారు… అధికారులు కావాలనే తమ నేత హౌస్ ను కూల్చేందుకు సిద్దమయ్యారని వైసీపీ నాయకులు కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు