వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్ కు భారీ షాక్

వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్ కు భారీ షాక్

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది… అందరు ఊహించిన విధంగానే ఆ పార్టీకి చెందిన మరో కీలకనేత రాజీనామా చేశారు… ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారధి వంటి కీలక నేతలు జనసేనకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ షాక్ నుంచి పవన్ కోలుకోక ముందే మరో షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు… తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి అందజేశారు… త్వరలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం…

ఈమేరకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్దం చేసుకున్నారు. కాగా మరికొద్దిరోజుల్లో జనసేన పార్టీకి మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి…