జగన్ కు బిగ్ షాక్ త్వరలో కీలక నేత గుడ్ బై

జగన్ కు బిగ్ షాక్ త్వరలో కీలక నేత గుడ్ బై

0

ప్రకాశం జిల్లా పర్చూరి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు… ఇటీవలే కాలంలో బీజేపీ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి జగన్ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

ఇక ఆమె చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన వైసీపీ… ఉంటే వైసీపీలోనైనా ఉండాలని లేదంటే తన భార్యతో పాటు బీజేపీలో చేరాలని అల్టిమేటమ్ జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో దగ్గుబాటి ఎలాగో తన భార్య వైసీపీలో చేరదు కనుకతానే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారట…

ఈ మేరకు బీజేపీ పెద్దలతో మంతనాలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మంచి ముహూర్తం చూసుకుని బీజేపీలో చేరాలని చూస్తున్నారట… కాగా 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరి నుంచి వైసీపీ తరపున పోటీ చేయగా ఆయన భార్య పురందేశ్వరి విశాఖలో ఎంపీ స్థానానికి పోటీ చేశారు… వీరిద్దరు ఓటమి చెందారు…