చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

చంద్రబాబుకు బిగ్ షాక్ వైసీపీలోకి 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

0

అధికార పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరేందుకు షరతులు లేవని చెబితే టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని కొటం రెడ్డి అన్నారు…

తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షహోదా ఉందంటే అది జగన్ మోహన్ రెడ్డి పుణ్యమే అని కోటం రెడ్డి అన్నారు…. పార్టీలో చేరేందుకు షరతులు లేవని ఒక్కమాట చెబితే వారందరు వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు….

అయితే తమ నేత విలువలకు విశ్వసనీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అందుకే పార్టీలో చేరే వారు ముందుగా రాజీనామా చేసిరావాలని షరతులు పెట్టారని అన్నారు….. 2024 ఎన్నికల్లో వైసీపీ బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని టీడీపీ 3వ స్ధానంలో ఉంటుందని అన్నారు..