సాకే పవన్ కి షాకిచ్చిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

సాకే పవన్ కి షాకిచ్చిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

0

పవన్ కల్యాణ్ రాజకీయంగా కామెంట్లు చేయడం దానికి సంబంధించి వైసీపీ విమర్శలు చేయడం గత నాలుగు రోజులుగా ఏపీలో రాజకీయం వీటి చుట్టూనే నడుస్తోంది ..తాజాగా జనసేన నాయకుడు సాకే పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెద్ద ఎత్తున సంచలనం అయ్యాయి, దీనిపై పవన్ కల్యాణ్ స్పందించలేదు. తాజాగా దీనికి సంబంధించి సీమ ప్రజలు కూడా భగ్గుమంటున్నారు. పార్టీ నేతలు ఇష్టంవచ్చిన రీతిన మాట్లాడుతుంటే పవన్ ఎందుకు వాటికి సపోర్ట్ చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల తలలు నరుకుతా అని జనసేన కార్యకర్త సాకే పవన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి దీనికి ఆయన సమాధానం చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.

వైసీపీ నేతలపై కామెంట్లు చేసిన సాకే పవన్ పై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు ఆయన. అసలు సాకే పవన్ కుమార్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని ప్రకాశ్ రెడ్డి అన్నారు. స్థాయికి తగ్గ వాళ్లకి పవన్ మైకులు ఇచ్చి మాట్లాడిస్తే మేలని సూచించారు. ఇలాంటి నాయకులకు అసలు గుర్తింపు ఉండదు అని, పవన్ ముందు అది తెలుసుకోవాలి అని అన్నారు, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు తమ గురించి కామెంట్లు చేస్తే ఎలా అని ప్రశ్నించారు