“రామారావు ఆన్‌ డ్యూటీ” నుండి బిగ్ అప్డేట్..వేణు లుక్‌ రిలీజ్‌

0

మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’

శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా నుండి అదిరిపోయె అప్డేట్ ఇచ్చారు.

కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఈ సినిమాలో కీ రోల్ పోషించనున్నారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసినట్టుగా చెబుతూ.. సీఐ మురళి పాత్రలో ఆయన లుక్ ను పరిచయం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here