బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది వీరే..

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది వీరే..

0

బిగ్బాస్ లో మరో ఎలిమినేషన్ ఎపిసోడ్ కు నాంది పడింది. ఈవారం ఎలిమినేట్ అయ్యే వారిలో శిల్ప చక్రవర్తి, శ్రీముఖి, పునర్నవి, మహేష్ లు ఉన్నారు. వీటితోపాటు రవి కూడా. రవి ముందే ఎలిమినేట్ అయిన ప్పటికీ బాబా భాస్కర్ పుణ్యమా అని తప్పించుకున్నాడు. ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యే వారిని ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.

బాబా భాస్కర్ ని తప్ప మిగిలిన వారిని రెండు భాగాలుగా విభజించారు. ఒక్క భాగంలోని ఒక్కో సభ్యుడు రెండో టీంలోని ఇద్దరిని ఎంపిక చేయాలని అన్నారు. అయితే 2 వారాల క్రితం హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్ప చక్రవర్తి నే అందరూ టార్గెట్ చేశారు.ఈ సమయంలో రాహుల్ ను ఎప్పుడూ నామినేట్ చేసే యాంకర్ శ్రీముఖి ఈసారి ఆ పని చేయకపోవడం గమనార్హం.

అయితే ఇదే సమయంలో ఆమెను నామినేట్ చేయకుండా రాహుల్ వదల్లేదు. ఈవారం ఎలిమినేట్ ప్రక్రియలో ఉన్న వారిలో పునర్నవి లేదా శిల్ప చక్రవర్తి బయటికి వెళ్లిపోవచ్చని అప్పుడే సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.