బిగ్ బాస్ కొత్త ప్లాన్ ఆదివారం ఎలిమినేషన్ తో పాటు ఆ సభ్యుడు రీ ఎంట్రీ

బిగ్ బాస్ కొత్త ప్లాన్ ఆదివారం ఎలిమినేషన్ తో పాటు ఆ సభ్యుడు రీ ఎంట్రీ

0

బిగ్బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది.. పది వారాలు పూర్తి అయ్యాయి.. 11 వారం నామినేషన్ ఘట్టం కూడా అయిపోయింది, ఇద్దరు మినహా మిగిలిన వారు నామినేట్ అయ్యారు, అయితే ఈ వారం ఎలిమినేష్ తర్వాత సరికొత్త గేమ్ చేంజ్ ఉంటుంది అంటున్నారు చాలా మంది.. అంతేకాదు ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లిన ఓ కంటెస్టెంట్ ని హౌస్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇప్పిస్తారు అని వార్తలు వస్తున్నాయి.

ఆ అవకాశం కూడా కుమార్ సాయికి వస్తుంది అంటున్నారు, ఈ వారం వీకెండ్ లో ఎలిమినేషన్ అయిన తర్వాత సోమవారం కచ్చితంగా ఈ నామినేషన్ ప్రక్రియకు ముందు ఇలా హౌస్ లోకి కుమార్ సాయి రీ ఎంట్రీ ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో అతనిపై సానుభూతి వ్యక్తం అయింది. అంతేకాదు మోనాల్ గుజ్జర్ వల్లే అతను ఎలిమినేట్ అయ్యాడని సానుభూతి వ్యక్తం అయింది.

ఈ సమయంలో ఆయనని హౌస్ లోకి తీసుకోవాలి అని చాలా మంది కోరారు, అయితే తాజాగా కుమార్ సాయికి ఈ ఛాన్స్ మరోసారి వస్తే వెళ్లడానికి ఆయన కూడా ఆసక్తి చూపించారు అంటున్నారు ఆయన అభిమానులు.. పలు ఇంటర్వ్యూల్లో కూడా ఇదే చెప్పారు, సో కచ్చితంగా కుమార్ సాయి రీఎంట్రీ పక్కా అని ఆయన అభిమానులు కూడ సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here