ఈ వారం నో ఎలిమినేషన్ మాస్టర్ అమ్మరాజశేఖర్ కు డబుల్ ఆఫర్

ఈ వారం నో ఎలిమినేషన్ మాస్టర్ అమ్మరాజశేఖర్ కు డబుల్ ఆఫర్

0

బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిదో వారం అద్బుతంగా సాగింది, మొత్తానికి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఎదురుచూశారు, అయితే ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలిపారు నాగార్జున, ముందు మాత్రం హౌస్ లో కాస్త హీట్ పెంచారు.

కన్ఫెషన్ రూమ్ కు మోహబూబ్ అమ్మరాజశేఖర్ ని పిలిచి ఎవరు ఇంట్లో ఉండాలి అని భావిస్తున్నారు అని హౌస్ మేట్స్ ని అడిగారు, ఈ సమయంలో అందరూ అమ్మరాజశేఖర్ కంటే మోహబూబ్ కి ఓట్లు వేశారు, ఈ సమయంలో నాగార్జున మాస్టర్ మీరు ఎలిమినేట్ అని తెలిపారు.

మోహబూబ్ భోరున విలపించాడు. ఇంటి సభ్యులంతా అతన్ని ఓదార్చారు. అయితే బయటకు వచ్చిన రాజశేఖర్ తాను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పాడు, ఈ సమయంలో ఒక్కసారిగా కింగ్ నాగార్జున ఓ విషయం చెప్పారు, నిన్న నోయెల్ వెళుతూ ఈ వారం ఎలిమినేషన్ పెట్టద్దు అని కోరాడు, సో ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పాడు నాగార్జున….మాస్టర్ ని సేవ్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించాడు. మీకు ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా వచ్చే వారం కెప్టెన్సీ పోటీకి నేరుగా ఎంపికయ్యారంటూ మరో ఆఫర్ ఇచ్చారు నాగార్జున.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here