బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరేనా..!!

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరేనా..!!

0

బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం అయినప్పటినుండి కూడా ఎన్నో వివాదాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. కాగా ఇప్పటివరకైతే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుందని చెప్పాలి. కాగా ఈ చివరి రోజుల్లో మాత్రం ఈ షో చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి ఇంటిలో 7 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.కానీ వీరిలో ఎవరికీ టైటిల్ వస్తుందనేది ఎవరు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. కాగా ఈ వారానికి జరిగే ఎలిమినేషన్ లో భాగంగా నామినేషన్ చేయడంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఆంక్షలకు విరుద్ధంగా బిగ్ బాస్ అందరిని నామినేట్ చేశారు.

అయితే ప్రస్తుతానికి అందరు కూడా ఎలిమినేషన్ కి దగ్గరగానే ఉన్నారు. కానీ వారి ఆట తీరు ను బట్టి అందులో వరుణ్, రాహుల్, శ్రీముఖి ముందు వరుసలో ఉండగా, ఆ తరువాత శివ జ్యోతి, వితిక ఉన్నారు. ఇక చివరి స్థానంలో బాబా భాస్కర్ మరియు అలీ ఉన్నారు. అంటే ఈసారి పక్కాగా చెప్పాలంటే మాత్రం బాబా అయినా, అలీ అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరితో పాటు శివ జ్యోతి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఎందుకంటే తానూ ఎపుడు ఎలాంటి గేమ్ ఆడుతుందో ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇకపోతే వరుణ్ ఈ షో లో ఉన్నంతవరకు వితిక కి ఎలాంటి ప్రమాదం లేదని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వితిక ఎలిమినేషన్ నుండి తప్పించున్నట్లే. కాగా ఇంత ఉత్కంఠ మధ్యన ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అందరు కూడా ఎదురు చూస్తున్నారు.